జయహో జొకోవిచ్‌

Update: 2019-07-15 01:03 GMT

వింబుల్డన్‌ చరిత్రలో సుదీర్ఘంగా జరిగిన ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. 4 గంటల 57 నిమిషాలపాటు సాగిన మారథాన్‌ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై జొకోవిచ్ జయకేతనం ఎగురవేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సెర్బియా యోధుడు జొకోవిచ్‌ 7-6, 1-6, 7-6, 4-6, 13-12తో ఫెడరర్‌పై నెగ్గాడు. జొకోవిచ్‌కు ఇది ఐదో వింబుల్డన్‌ టైటిల్‌ కాగా గడచిన 71 ఏళ్లలో మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకొని టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా జొకో రికార్డులకెక్కాడు.  

Tags:    

Similar News