India vs New Zealand షెడ్యుల్ వచ్చేసింది.

Update: 2020-01-21 09:04 GMT

ఈ ఏడాది సొంత గడ్డపై శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో తలపడిన బడిన భారత జట్టు మంచి విజయాలను అందుకుంది. ఈ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లనుంది. అక్కడ భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల ఆడనుంది. దీనికి సంబంధించిన షెడ్యుల్ ఖరారు అయింది.

ఇరు జట్ల మధ్య జనవరి 24న అక్లాండ్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఆ తర్వాత జనవరి 26న అక్లాండ్ వేదికగా రెండో టీ20, జనవరి 29న హామిల్టన్ వేదికగా మూడో టీ20, జనవరి 31న వెల్లింగ్టన్ వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న బే ఓవల్ వేదికగా ఐదో టీ20 జరుగుతుంది. ఇక్కడితో కివీస్ జట్టుతో టీ20 సిరీస్ ముగుస్తుంది.

ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే మొదలవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది. అనంతరం టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ హామిల్టన్ వేదికగా 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 21 నుంచి 25 వరకూ వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇక ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకూ క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. దీనితో కివీస్ టూర్ ని కంప్లీట్ చేసుకొని జట్టు భారత్ కి చేరుకుంటుంది

భారత కాలమాన ప్రకారం టీ20 మ్యాచ్‌లు మధ్యాహ్నం 12.30 గంటలకి ప్రారంభం కాగా, వన్డే మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలు మొదలుకానున్నాయి. ఇక టెస్ట్ మ్యాచ్‌లు ఉదయం 4 గంటలకి మొదలవుతాయి.

ఈ మేరకు ఇరు జట్ల సెలక్టర్లు ఇప్పటికే టీ20 జట్టుని ప్రకటించారు.

భారత్ :

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్

న్యూజిలాండ్ :

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, స్కాట్ కుగ్లిజిన్, కొలిన్ మున్రో, కొలిన్ గ్రాండ్‌హోమ్, టామ్ బ్రూసీ, డార్లీ మిచెల్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), హమీశ్ బెనెట్, ఇస్ సోధి, టిమ్ సౌథీ, బ్లైర్ టింకర్ 

Tags:    

Similar News