ఈ మ్యాచూ వర్షార్పణమే!

Update: 2019-06-13 14:14 GMT

వరల్డ్ కప్ టోర్నీలో పది టీములు పాల్గొంటున్నాయని ఐసీసీ చెప్పింది. కానీ పదకొండో టీమ్ గా వరుణుడు వచ్చి చేరాడు. ఇప్పటికే మూడు మ్యాచ్ లు గెలిచిన వాన దేవుడు.. ఈరోజు కీలకమైన భారత్, న్యూజిలాండ్ మ్యాచు ను కూడా దిగ్విజయంగా అడ్డుకుని మరో రద్దు తన ఖాతాలో వేసుకున్నాడు. గత సోమవారం నుంచి ఇక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ జరిగేది కష్టమేనని వాతావరం శాఖ చెపుతూనే ఉంది. వారన్నట్టుగానే.. టాస్ కూడా అవకుండానే మ్యాచ్ రద్దయింది. 

ఈ మ్యాచ్ రద్దు తో రెండు జట్లకు చెరో పాయింటూ లభించింది. ఇప్పటికే ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఏడు పాయింట్లతో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటి దాకా రెండు మ్యాచ్ లు ఆది రెండిటినీ గెల్చి నాలుగు పాయింట్లు మూటకట్టుకున్న భారత్ కు ఇపుడు మరో పాయింట్ వచ్చి చేరింది. ఇపుడు భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది. సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారకుండా ఉండాలంటే.. కచ్చితంగా పాకిస్థాన్ పై భారత్ గెలవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News