చేదు వార్త..మ్యాచ్ కష్టమే!

Update: 2019-06-13 12:13 GMT

వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ తో టీమిండియా నాటింగ్ హాం లో ఈరోజు తలపడాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా టాస్ కూడా ఇప్పటివరకూ వేసే పరిస్థితి లేకపోయింది. ఈ రోజు ఉదయం వరకూ అక్కడ వర్షం కురిసింది. తరువాత వర్షం తగ్గినా అప్పుడప్పుడు జల్లులు పడ్డాయి. దీంతో పిచ్ పై కవర్లు అలానే ఉంచారు. ఈ జల్లులకు మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. కనీసం ఒక గంటైనా వర్షం ఆగితే.. కవర్లు తొలగించి, పిచ్ సిద్ధం చేస్తారు. తరువాత అంపైర్లు పిచ్, అవుట్ ఫీల్డ్ తనిఖీ చేసి మ్యాచ్ పై తమ నిర్ణయం ప్రకటిస్తారు. 

Tags:    

Similar News