జడేజా.. సూపర్ స్పీడ్ ఓవర్!

Update: 2019-07-10 04:09 GMT

జడేజాను 3డీ మ్యాన్ గా పేర్కొంటారు. ఎందుకంటే, ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ తోనే కాకుండా ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటే క్రికెటర్ అతను. అంతేకాదు ఫీల్డింగ్ లో చాలా చురుకుగా కదులుతాడు. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతి జడేజా ఉన్న వేపు వెళితే దానికి రన్ రానట్టే లెక్క. అంత వేగంగా ఉంటుంది అతని త్రో. ఇది సహజంగా చాలా మంది ఫీల్డింగ్ లో చేసే పనే. అయితే, బౌలింగ్ లోనూ మనోడి వేగం మామూలుగా ఉండదు. అంటే,బంతి వేగం కాదు. ఓవర్ వేసే వేగం. సాధారణంగా ఒక ఫాస్ట్ బౌలర్ ఒక ఓవర్ వేయాలంటే 4 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. అదే స్పిన్నర్ అయితే 3 నిమిషాల పైన తీసుకుంటారు. కానీ, జడేజా రెండంటే రెండు నిమిషాల్లోపే ఓవర్ పూర్తి చేసేస్తాడు. ఇపుడు కివీస్ తో నిన్న వాయిదా పడిన సెమీస్ లో అయితే, కేవలం 93 సెకన్లలో ఓవర్ కానిచ్చేశాడు. ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇది జరిగింది. ఈ ఓవర్లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు జడేజా. ఇంత త్వరగా ఓవర్ పూర్తి చేయడం వన్డేల్లో వండరే!

Tags:    

Similar News