ఇండోర్ టెస్ట్ : భారత్ అలవోక విజయం

ఇండోర్ వేదికగా బాంగ్లాదేశ్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.

Update: 2019-11-16 12:13 GMT
Ind vs Ban 1st test match

ఇండోర్ టెస్ట్ : ఇండోర్ వేదికగా బాంగ్లాదేశ్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల దాటికి బంగ్లా 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది.దీనితో భారత్ 130 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో ముందంజలో ఉంది.. మొదటగా మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకు మాత్రమే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లకి గాను 493 పరుగులు చేసి డిక్లేర్ చేసింది...

ఇందులో మాయంకా అగర్వాల్ డబల్ సెంచరీ చేసాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాకి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ దశలోను బంగ్లా ఆటగాళ్లను నిలదొక్కుకోకుండా చేసారు. దీనితో బంగ్లాదేశ్ 213 పరుగులకే ఆలౌట్ అయింది . బంగ్లా ఆటగాళ్లలో ముషిఫికర్ ఒక్కడే జట్టును ఆదుకునే ప్రయత్నం చేసాడు. భారత బౌలర్లు షమి 4 ,అశ్విన్ 3, ఉమేశ్ 2,ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.

Tags:    

Similar News