India vs West Indies: మూడో వికెట్ ను కోల్పోయిన భారత్

భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమయ్యింది. ఆదివారం మొదలైన మొదటి వన్డేలో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Update: 2019-12-15 09:46 GMT

భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమయ్యింది. ఆదివారం మొదలైన మొదటి వన్డేలో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు భారత్ టీంలో రెండు మార్పులను చోటుచేసుంది. చివరి టీ 20లో తమదైన స్టైల్లో ఆడిన భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లు కొన్ని కారణాల వలన ఆటనుంచి తప్పుకున్నారు.

వీరి స్థానంలో కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా జట్టులోకి దిగారు. ఇప్పటివరకూ విండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లను భారత్ చేజిక్కించుకుంది. ఇదే విధంగా ఈ మ్యాచ్ ను గెలిచి తమ సత్తా చాటుచోవాలని చూస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ లోనూ భారీగా మార్పులు జరిగాయి. ఈ మ్యాచ్ లో ఏకంగా ఐదుగురు ప్లేయర్లను మార్చారని తెలిపారు. మార్చిన ప్లేయర్లలో షాయ్ హోప్, సునీల్ అంబ్రిస్, రోస్టన్ చేస్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్‌లను తుదిజట్టులోకి తీసుకుంది.

ఇదిలా ఉండగా 80 పరుగులను తన ఖాతాలో జమ చేసుకున్న భారత్ కొద్ది సేపటి క్రితమే మూడోవికెట్ ను కూడా కోల్పోయింది. లోకేష్ రాహుల్ 6 ఓవర్ల 2 బాళ్ల వద్ద వెనుదిరిగాడు, ఇక విరాట్ కోహ్లి 7 వ ఓవర్ వద్ద పెవిలియన్ దారి పట్టాడు. 18 ఓవర్ల 1 బాల్ నడుస్తుండగా రోహిత్ శర్మ అవుటయ్యారు. 

Tags:    

Similar News