రెండో వన్డే ముందు విండీస్‌కు భారీ షాక్

చెపాక్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించి జోష్ మీద ఉన్న విండీస్‌కు షాక్ తగిలింది.

Update: 2019-12-16 14:04 GMT
West Indies File Photo

చెపాక్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించి జోష్ మీద ఉన్న విండీస్‌కు షాక్ తగిలింది. వెస్టిండీస్ ఆటగాళ్లందరి స్లో ఓవర్ రేట్ కారణంగా 80 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూన్నట్లు.. రిఫరీ డేవిడ్ బూన్ ప్రకటించారు. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే భారత జట్టులోని కీలక బ్యాట్స్ మెన్ లను పెవిలియన్ బాట పట్టించిన విండీస్ బౌలర్లు, పంత్, శ్రేయాస్ అయ్యా్ర్ వికెట్లు తీయడంతో తడబడ్డారు. దీంతో కెప్టెన్ పొలార్డు పదేపదే బౌలర్ల వద్దకు వచ్చి చర్చలు జరపడం, ఓవర్ సగంలోనే ఫీల్డింగ్ మార్పులు చేర్పులు చేస్తుండడంతో మ్యాచ్ సమయం ఎక్కువ పట్టింది.

దీంతో విండీస్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ డేవిడ్ బూన్ వెల్లడించారు. దీంతో విండీస్ తొలి వన్డే గెలిచి ఉవ్విళ్లురుతున్న విండీస్ ఆనందం ఆవిరైపోయింది. ఈ మ్యాచ్‌లో జట్లకు కేటాయించిన సమయంలో మాత్రమే బౌలింగ్ పూర్తి చేయాలి. కానీ, విండీస్ మాత్రం ఆ సమయంలో బౌలింగ్ 4 ఓవర్ల సమయం ఎక్కువ తీసుకుంది. దీంతో 80 శాతం జరిమానా వేశారు. సాధారణంగా బౌలర్ ఒక ఓవర్ తక్కువగా వేస్తే 10 శాతం ఫీజు ఉంటుంది. బుధవారం విశాఖపట్నం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు స్టేడియంకు చేరుకున్నాయి. మ్యాచ్ విజయంపై కసరత్తు ప్రారంభించాయి. రెండో వన్డేలో విండీస్ విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. అయితే ఇప్పటి వరకు విశాఖ వేదిక జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు పైచేయి సాధిస్తూ వచ్చింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు బౌలింగ్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. విండీస్ మాత్రం మొదటి వన్డేలో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. 

Tags: