తడబడ్డ నిలబడ్డారు : వెస్టిండీస్ విజయ లక్ష్యం 289 పరుగులు

Update: 2019-12-15 12:37 GMT
India

భారత్ - వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇందులో భారత బాట్స్ మెన్స్ శ్రేయాస్ అయ్యర్ 70 పరుగులు (5 *4 1*6 ) , రిషబ్ పంత్ 70 పరుగులు (7 *4 1*6 ) పరుగులు చేసి భారత స్కోర్ బోర్డుని నిలబెట్టారు.

మొదటగా టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు భారత జట్టును బ్యాటింగ్ ని ఆహ్వానించింది. భారత ఓపెనర్స్ శిఖర్ ధావన్ (6), రోహిత్ శర్మ (36) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. కెప్టెన్ కోహ్లి(4) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. దీనితో 80 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది భారత జట్టు. ఈ క్రమంలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

నాలుగో వికెట్ కి ఇద్దరు కలిసి 114 పరుగులు చేశారు. ఇక జట్టు స్కోర్ మెరుగైన దిశగా వెళ్తుంది అన్న క్రమంలో ఇద్దరు వెనువెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ (35) , రవీంద్ర జేదేజా (21) మెరపులు మెరిపించడంతో భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగలిగింది. దీనితో వెస్టిండిస్ జట్టు ముందు 289 పరుగుల లక్ష్యం ఉంది. 

Tags:    

Similar News