హాకీ దిగ్గజం బల్బీర్‌సింగ్‌ ఇక లేరు!

భారత హాకీ దిగ్గజం బల్బీర్‌సింగ్‌ (95) ఇక లేరు.. గత కొద్ది రోజులుగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

Update: 2020-05-25 08:18 GMT
Balbirsingh (File Photo)

భారత హాకీ దిగ్గజం బల్బీర్‌సింగ్‌ (95) ఇక లేరు.. గత కొద్ది రోజులుగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. బల్బీర్‌ సింగ్‌ సోమవారం ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారని మొహాలీలోని పోర్టిస్ట్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ అభిజిత్‌ సింగ్‌ వెల్లడించారు. మే 8వ తేదీనే బల్బీర్‌ను ఆసుపత్రిలో చేరగా, అక్కడ ఆయనకి వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

1948, 1952, 1956 ఒలింపిక్స్‌లో బల్బీర్‌ సింగ్‌ భారత హాకీ టీంకు మూడు స్వర్ణపతకాలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 1952లో నెదర్లాండ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్‌ రికార్డును బల్బీర్‌ సాధించారు. ఈ రికార్డు ఇప్పటికీ ఆయన పేరుపైనే ఉండడం విశేషం.. అంతేకాకుండా 1975 వరల్డ్‌ కప్‌ విన్నర్‌ భారత హాకీ టీంకు చీఫ్‌ కోచ్‌, మేనేజర్‌ గా వ్యవహరించారు. ఒలింపిక్స్‌ పురుషుల హాకీ ఫైనల్‌ లో అత్యధిక గోల్ఫ్స్‌ చేసిన వ్యక్తిగా బల్బీర్‌ సింగ్‌ రికార్డు సృష్టించారు. బల్బీర్ సింగ్ కు కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. 1957లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది.


Tags:    

Similar News