పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కి కరోనా పాజిటివ్!

కరోనా వైరస్... కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పాకిస్థాన్ లో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంది.

Update: 2020-05-24 15:18 GMT
Taufeeq umar (File Photo)

కరోనా వైరస్... కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పాకిస్థాన్ లో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ఆటగాడు తౌఫీక్ ఉమర్ వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆ దేశ స్పోర్ట్స్ చానెల్ క్రికెట్ పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం తౌఫీక్ ఉమర్ తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

తౌఫీక్ ఉమర్ 2001లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్ లోనే 163 బంతుల్లో 104 పరుగులు చేసి సత్తా చాటాడు. మొత్తం తౌఫీక్ తన క్రికెట్ కెరీర్లో 44 టెస్టులు, 22 వన్డేలు ఆడాడు. అందులో టెస్ట్ మ్యాచ్ లలో ఏడూ సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 2963 పరుగులు చేశాడు. వన్డేల్లో 504 రన్స్ చేశాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతను చివరగా 2014లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్ లో ఆడాడు.

ఇక ఆ దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి అక్కడ కేసుల సంఖ్య యాబై వేల మార్క్ ని దాటింది. ఇప్పటి వరకు మొత్తం 50,694 మంది కరోనా బారిన పడగా, 1,067 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనాతో పోరాడి 15,201 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News