ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి

Update: 2019-06-30 17:32 GMT

భారీ లక్ష్యాన్ని చేరుకోలేక చేతులెత్తేశారు భారత్ బ్యాట్స్ మెన్. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచింది. అయితే బ్యాటింగ్ ప్రారంభించిన రెండో ఓవర్లోనే ఓపెనర్ రాహుల్ వికెట్ కోల్పోయింది. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ రోహిత్ తో కలసి ఇన్నింగ్స్ పునర్నిర్మించే పనిలో పడ్డాడు. కానీ, నిదానంగా ఆడటంతో కావలసిన పరుగుల రేటు పెరుగుతూ వచ్చింది. కీలక సమయంలో కోహ్లీ పెవిలియన్ చేరడంతో ఒత్తిడి మరింత పెరిగింది. రోహిత్ శర్మ సెంచరీ చేసి వెంటనే అవుతాడంటతో భారత్ ఓటమి దాదాపు ఖరారైంది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ పెంచుకోవడంలో ఇండియా ఇబ్బంది పడింది బ్యాట్స్ మెన్ మెరుపులు మెరిపించినా అవి కావాల్సిన పరుగుల ముందు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో నిర్ణీత ఓవర్లు పూర్తయే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 306 పరుగులు మాత్రమే చేసింది ఇండియా. మొత్తమ్మీద ఇంగ్లాండ్ జట్టు 31 పరుగుల తేడాతో టీమిండియా ను ఓడించింది. ఇప్పటిదాకా వరల్డ్ కప్ టోర్నీలో పరాజయం ఎరుగని ఇండియా తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. 


Tags:    

Similar News