ఉతికేస్తున్న ఇంగ్లాండ్!

Update: 2019-06-18 11:25 GMT

వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో తలపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపెడుతోంది. పదో ఓవర్ లో జేమ్స్‌ విన్సి (26; 31 బంతుల్లో )  దవ్లత్‌ జర్దాన్‌ వేసిన 9.3వ బంతిని ఆడబోయి ముజీబ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తరువాత వచ్చిన జో రూట్‌, బెయిర్‌ స్టో తో కల్సి విజృంభిస్తున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 25 ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ నష్టానికి 163 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో(74 ), జో రూట్‌ (37 ) క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News