ఇంగ్లాండ్ ఓపెనర్లు స్థిరంగా దూసుకుపోతున్నారు. భారత బౌలర్లు వారిపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. బుమ్రా ఒక్కడే కొద్దిగా వారిని కట్టడి చేయగలిగాడు. రెండో వైపు నుంచి అతనికి సహకారం అందించే బౌలర్ కరువయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ఓపెనర్లు భారీ స్కోరు దిశగా స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. వికెట్ తీయడానికి కోహ్లీ బౌలర్లను మార్చినప్పటికీ ఫలితం దక్కలేదు. సమర్తవంతంగా భారత బౌలర్లను సులువుగా ఎద్రుర్కుంటున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరూ తమ అర్థ సెంచరీల వైపు సునాయాసంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ జట్టు 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు సాధించింది. రాయ్ 44 పరుగులతోనూ, బెయిర్‌స్టో 48 పరుగులతోనూ ధాటిగా ఆడుతున్నారు.
Fifty partnership for Jason Roy and Jonny Bairstow 5️⃣0️⃣
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
It's their 17th in ODIs 👏
They've converted eight of the previous 16 into century stands - can they do so again today?#CWC19 | #ENGvIND pic.twitter.com/ViAZhRUvS2