దూకుడుగా ముందుకు వెళుతున్న ఇంగ్లాండ్!

Update: 2019-06-08 10:39 GMT

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో ఈరోజు 12 వ మ్యాచ్ ఇంగ్లాండ్, బంగాళాదేశాల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన బాంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో ఆచి తూచి ఆడింది. బాంగ్లాదేశ్ స్పిన్నర్లతో తన బౌలింగ్ దాడిని మొదలుపెట్టింది.  ఇంగ్లాండ్ ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌ స్టో నిలకడగా బ్యాటింగ్ ప్రారంభించారు. ఒకపక్క జేసన్ రాయ్ పరుగులు రాబట్టే ప్రయత్నం చేస్తే, మరోపక్క బెయిర్ స్టో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. 5  ఓవర్లకు 15 పరుగులు చేసిన ఇంగ్లాన్డ్ ఆరోఓవర్ నుంచి పరుగుల వేగం పెంచింది. సైఫుద్దీన్‌ వేసిన పన్నెండో  ఓవర్‌లో జేసన్‌ రాయ్‌ (51; 39 బంతుల్లో) వరుస సిక్సర్‌, బౌండరీలు బాడీ  అర్ధశతకం సాధించాడు. కుదురుకున్న బెయిర్ స్టో కూడా బ్యాటుకు పని చెప్పాడు. 18 వ ఓవర్ లో ప్రపంచ కప్ లో తన తొలి అర్థ సెంచరీని సాధించాడు. అటు తరువాత వేగంగా ఆడే క్రమంలో బెయిర్‌ స్టో (51; 50 బంతుల్లో ) ఔటయ్యాడు. మొర్తజా వేసిన 19.1వ బంతిని ఆడబోయి మెహదీ హసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 130 పరుగులు చేసి భారీ సొరుపై కన్నేసింది. రాయ్ 75  (66 ) పరుగులతోనూ, రూట్ 1 పరుగుతోనూ క్రీజులో  ఉన్నారు. 



Tags:    

Similar News