ఐపీఎల్ రెండో క్వాలిఫైర్ మ్యాచులో ఢిల్లీ తడబ్యాటు

Update: 2019-05-10 15:55 GMT


తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచులో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ లో ఆకట్టుకోలేకపోయింది. చెన్నై అనుభవం ముందు తేలిపోయింది. కొద్దిపాటి లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. కేవలం 147 పరుగులే చేసింది. మొదట్నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వఛ్చిన ఢిల్లీ జట్టుకు పంత్ నిలబడడంతో ఆమాత్రమైనా స్కోరు చేయగలిగింది. చెన్నై బౌలర్లు దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, డ్వేన్‌ బ్రావో, జడేజా సమిష్టిగా రాణించి తలో రెండు వికెట్లు తీశారు. నిలకడైన బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. శిఖర్ ధావన్‌ (18), పృథ్వీషా (5), శ్రేయస్‌ అయ్యర్‌(13), అక్షర్‌పటేల్‌(3), రూథర్‌ఫర్డ్‌ (10) విఫలం అయ్యారు. పంత్ వికెట్ కాపాడుకుంటూనే 35 పరుగులు చేశాడు. ధాటిగా ఆడే అవకాశం పంత్ కు దక్కలేదు. ఇక కొలిన్‌ మన్రో (27) పరుగులు చేయడంతో మూడంకెల స్కోరు ఢిల్లీ చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని చన్నై ఏ విధంగా ఛేదిస్తుందన్నదే ఇపుడు ప్రశ్న. 

Similar News