పుజారా డబుల్‌ సెంచరీ మిస్‌.. చేస్తే మాత్రం..

Update: 2019-01-04 02:54 GMT

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అదరగొట్టింది. కానీ చతేశ్వర్‌ పుజారా తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశం మిస్ అయింది. 373 బంతుల్లో 22 ఫోర్లతో 193 పరుగులు చేసి లయన్‌ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో నిరాశగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 470/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రిషబ్‌ పంత్‌(77). అతడికి తోడుగా రవీంద్ర జడేజా(19) క్రీజ్‌లో ఉన్నారు.

ఇప్పటికే టెస్టుల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేశాడు పుజారా. అయితే ఇందులో రెండు ఆస్ట్రేలియాపైనే సాధించడం గమనార్హం. 2012, నవంబర్‌లో అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 206 నాటౌట్, 2013, మే నెలలో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగులు చేశాడు. 2017, మార్చిలో ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్ లో మరో డబుల్‌ సెంచరీ(202) సాధించాడు. ఈ మ్యాచ్ లో కూడా డబల్ సెంచరీ సాధిస్తే ఆసీస్ పై మూడుసార్లు డబల్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ లలో పూజారా కూడా నిలిచేవాడు. 

Similar News