గాయమైనా సరే.. ఆటే ముఖ్యం!

Update: 2019-05-14 09:19 GMT

చివరి వరకూ పోరాడి ఒకే పరుగు తేడాతో మ్యాచును.. కప్పును కోల్పోయిన చెన్నై పోరాటపటిమ ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. ధోనీ రనౌట్ మ్యాచ్ ను మలుపు తిప్పిందంటున్న వారు.. అంపైర్ తప్పిదం వల్లే ఇది జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 80 పరుగులు చేసి దాదాపుగా చెన్నైని విజయ తీరాలకు చేర్చిన వాట్సాన్ కీలక సమయంలో రనౌట్ కావడమూ చెన్నై గెలుపు పై ప్రభావం చూపించిందనే విషయాన్నీ కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే, ఇప్పుడొక ఆసక్తికర విషయాన్ని చెన్నై బౌలర్ హర్భజన్ బయట పెట్టాడు. వాట్సాన్ ఎడమ మోకాలికి ఆట మధ్యలో గాయమైంది. ఆ గాయం నుంచి రక్తం కారుతున్నా సరే, ఆగకుండా బ్యాటింగ్ చేశాడట వాట్సాన్. ఇన్స్టాగ్రామ్ లో సంబంధిత ఫోటో పెట్టి వాట్సాన్ పోరాటపటిమను మెచ్చుకుంటూ కామెంట్ పెట్టాడు హర్భజన్. ఇది ఇపుడు అభిమానుల మనసుల్లో వాట్సాన్ పై అభిమానాన్ని రెట్టింపు చేసింది. ఒకవైపు రక్తం కారుతున్నా బ్యాటింగ్ చేసి క్రికెట్ ను గెలిపించాడంటూ వాట్సాన్ పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. 

Similar News