గర్జించిన బంగ్లా బెబ్బులి.. వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్ రికార్డు విజయం..

Update: 2019-06-18 04:50 GMT

టాంటాన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ సునాయస విజయం సాధించింది. ఎదురైంది పటిష్టమైన ప్రత్యర్థే అయినా ఎదురుగా ఉన్నది భారీ స్కోరే అయినా బంగ్లాదేశ్‌ చకచకా ఛేదించింది. వెస్టిండీస్ విధించిన 322 పరుగుల లక్ష్యాన్ని తెలికగా ఛేదించింది. షకీబ్ ఉల్ హసన్ (124 నాటౌట్) మెరుపు సెంచరీతో విండీస్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు కనిపించాయి. ఫలితంగా కేవలం 41.3 ఓవర్లకే బంగ్లాదేశ్ 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Tags:    

Similar News