సింధుకు రూ.20 లక్షల రివార్డ్

సింధుకు రూ.20 లక్షల రివార్డ్, సాయిప్రణీత్‌కు రూ.5 లక్షల రివార్డ్‌ ప్రకటించింది. కాగా సింధుకు కర్ణాటక సీఎం యడియూరప్ప రూ.5లక్షల బహుమానం ప్రకటించారు.

Update: 2019-08-26 04:58 GMT

నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న కల.. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనత.. ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెలుచుకున్నా.. సాకారం కాని స్వొప్నం.. కానీ ఈ సారి మాత్రం సింధు ఆగలేదు.. ఎగసి పడిన అలలా కాకుండా.. సునామీలా విరుచుకుపడింది.. ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో పసిడి పట్టింది.. విశ్వవేదికపై మువ్వన్నెల జెండా రెప రెప లాడేలా చేసింది.. ఒక్క విజయం భారత క్రీడాచరిత్రలో ఆమె పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఆరంబంలోనే అంతంలోనూ అదరగొట్టింది.

ఫైనల్లో జపాన్ అమ్మాయి నజోమీ ఒకుహరపై వరుస గేముల్లో గెలిచింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు 21-7, 21-7తో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో క్రిడాకారులకు రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. పతకాలు కొల్లగొట్టిన సింధు, సాయిప్రణీత్‌కు భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) నజరానా ప్రకటించింది. సింధుకు రూ.20 లక్షల రివార్డ్, సాయిప్రణీత్‌కు రూ.5 లక్షల రివార్డ్‌ ప్రకటించింది. కాగా సింధుకు కర్ణాటక సీఎం యడియూరప్ప రూ.5లక్షల బహుమానం ప్రకటించారు.  

Tags:    

Similar News