పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

Update: 2019-06-06 17:30 GMT

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడిన వెస్టిండీస్ జట్టు ఓటమి పాలైంది. తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు క్రమంగా నిలదొక్కుకుని, ప్రత్యర్థికి సవాల్ విసిరెలాంటి స్కోరు చేయగలిగింది. 288 పరుగులు చేసి గౌరవం దక్కించుకుంది. అయితే ఛేదనలో విండీస్ పోరాడింది. కానీ, చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి, 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, కారే, నైల్ లు బాట్ తో రాణించారు. స్మిత్, నైల్ ఇద్దరే ఆసీస్ భారీ స్కోరుకు కారకులయ్యారు. వెస్టిండీస్ జట్టులో బ్రాత్వైట్ మూడు వికెట్లు, థామస్,షెల్డన్, రస్సెల్ రెండేసి వికెట్లూ తీశారు. ఇక విండీస్ బ్యాటింగ్ లో హోప్, పూరం, హోల్డర్ విజయం కోసం పోరాడారు. హోల్డర్ 48 వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి జంపకు కేచ్ ఇచ్చి వెనుతిరిగారు. దీంతో మ్యాచ్ ఆసీస్ పరమైపోయింది. ఆసీస్ జట్టులో స్టార్క్ 5 వికెట్స్నుల్ తీసి విడీస్ నడ్డి విరిచాడు. ఇక కమిన్స్ 2  వికెట్లు తీశాడు. 

Tags:    

Similar News