రెండో ఓవర్లోనే ఆమ్లా అవుట్!

Update: 2019-06-23 14:03 GMT

పాకిస్తాన్తో వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా తలపడుతున్న సౌతాఫ్రికా ఆరంభంలోనే కీలక వికెట్ కోల్పోయింది. 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా కు ఆమిర్ షాక్ ఇచ్చాడు. తన తొలి ఓవర్ తొలి బంతికే ఆమ్లా ను వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. మూడు బంతులాడి రెండు పరుగులు చేసిన ఆమ్లా పెవిలియన్ చేరాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. డి కాక్ 6 పరుగులతోనూ, డుప్లెసిస్ 6 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News