ఎవరి దగ్గర నాలుగు ఐదు వందల నోట్లుంటే వారే రైట్ : ఐసీసీపై అమితాబ్ పంచ్!

Update: 2019-07-16 12:29 GMT
big b amithab satirical tweet on icc boundary rule

''నా దగ్గర రెండు వేల నోటు ఉంటే.. మీ దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉంటే మీ లెక్క ప్రకారం మీరే గొప్ప కదా!'' అంటూ ఐసీసీ పై బిగ్ బీ అమితాబ్ సెటైర్లు వేశారు. వరల్డ్ కప్ ఫైనల్ లో తెరపైకి వచ్చిన బౌండరీల నిబంధనపై ఇప్పటికే ప్రపంచమంతా దుమ్మెత్తిపోస్తోంది. దానికి ఇప్పుడు అమితాబ్ కూడా జతకూరారు. ఈ విషయంపై ట్విట్టర్ లో ఆయన వ్యంగ్యంగా స్పందించారు.

మరోవైపు ఐసీసీ రూల్స్‌పై బాలీవుడ్‌ విలక్షణ నటుడు పరేష్‌ రావల్‌ సైతం ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. 'ఎంఎస్‌ ధోని గ్లౌవ్స్‌ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్‌ ఓవర్‌ రూల్స్‌ మార్చుకుంటే బాగుంటుంది' అని చురకలంటించారు.



Tags:    

Similar News