అఫ్గానిస్థాన్‌ విజయ లక్ష్యం 263

Update: 2019-06-24 13:18 GMT

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు అఫ్గానిస్థాన్‌, బాంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పగించింది అఫ్గానిస్థాన్‌. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడూ వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. నిదానంగా బ్యాటింగ్ ప్రరారంభించిన బంగ్లాదేశ్ జట్టు దూకుడుగా ఆడటం ప్రారంభించింది. అయితే, అవకాశం దొరికినపుడు బంతిని వెంటాడుతూ, ఆచి తూచి ఆడారు బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్. మొదటి వికెట్ త్వరగా పడిపోయిన క్రమంలో  షకిబ్‌ , తమీమ్‌ బాధ్యతగా ఆడుతూ స్కోరు బోర్డును నిదానంగా పరుగులెత్తించారు. అయితే, 17 వ ఓవర్లో నబీ కీలకమైన వికెట్‌ తీశాడు. చివరి బంతిని ఆడబోయిన తమీమ్‌ ఇక్బాల్‌ (36; 53 బంతుల్లో) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. తరువాత వచ్చిన రహీమ్‌ తో కలసి షకీబ్ చక్కని సమన్వయంతో ఆడాడు. ఈ క్రమంలో షకీబ్ ప్రపంచకప్‌లో 1000 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ జట్టులో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 28 వ ఓవర్లో షకీబ్ తన అర్థశతకాని సాధించాడు. కానీ, తరువాతి ఓవర్లోనే ముజీబ్‌ వేసిన బంతికి ఎల్బీ గా పెవిలియన్ చేరాడు. తరువాత రహీమ్ బాధ్యతా యుతంగా అది విలువైన 83 పరుగులు చేశాడు. 43 ఓవర్ల వరకూ నాలుగు వికెట్ల నష్టంతో ముందుకు సాగిన బంగ్లాదేశ్.. తరువాత వేగాన్ని పెంచే క్రమంలో వికెట్లు కోల్పోతూ వచ్చింది. మొత్తమ్మీద బంగ్లాదేశ్ గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది.  


Tags:    

Similar News