ఇండియాతో మూడో వన్డే.. విండీస్ ఓపెనర్ల విధ్వంసం..

తమ విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. విండీస్ ఓపెనర్లు క్రిస్ గేల్.. ఎవిన్ లూయిస్ లు భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు.

Update: 2019-08-14 15:22 GMT

తమ విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. విండీస్ ఓపెనర్లు క్రిస్ గేల్.. ఎవిన్ లూయిస్ లు భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు.తమ విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. విండీస్ ఓపెనర్లు క్రిస్ గేల్.. ఎవిన్ లూయిస్ లు భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు. భువనేశ్వర్ బౌలింగ్ లో మొదట్లో ఆచి తూచి ఆడిన ఈ ఇద్దరు ఒపెనర్లూ.. ముఖ్యంగా గేల్.. తరువాత రెచ్చిపోయారు. భువనేశ్వర్, ఖలీల్ ల బౌలింగ్ లో ఓఆట ఆడుకున్నారు. దీంతో పది ఓవర్లకు విండీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. గేల్ 33 బంతుల్లో కెరీర్లో నాలుగో వేగవంతమైన అర్థ సెంచరీ సాధించాడు. మరోవైపు లూయీస్ 43 పరుగులు చేసి తన అర్థసెంచరీకి దగ్గరగా వచ్చాడు. ఈ దశలో 12వ ఓవర్ బౌలింగ్ వేసిన చాహల్ విండీస్ ఒపెనర్లిద్దరినీ ఒకే ఓవర్ లో అవుట్ చేసి దెబ్బతీశాడు. అటు తరువాత విండీస్ బ్యాటింగ్ లో వేగం తగ్గింది. 16 ఓవర్లు ముగిసేసరికి ఆజట్టు 137 పరుగులు చేసి రెండు వికెట్లు నష్టపోయింది. క్రీజులో షైహోప్‌ (6), హెట్‌మైయిర్‌ (10) ఉన్నారు.


Tags:    

Similar News