Hanuman Chalisa: శనివారం హనుమాన్ చాలీసా ఎప్పుడు, ఎన్ని సార్లు పఠించాలి? ప్రయోజనాలు ఇవే

శనివారం హనుమాన్ చాలీసా ఎప్పుడు, ఎన్ని సార్లు పఠించాలి? శని దోష నివారణ, మానసిక శాంతి, కష్టాల తొలగింపుకు హనుమాన్ చాలీసా పఠన ప్రయోజనాలు తెలుసుకోండి.

Update: 2026-01-03 09:13 GMT

Hanuman Chalisa: శనివారం హనుమాన్ చాలీసా ఎప్పుడు, ఎన్ని సార్లు పఠించాలి? ప్రయోజనాలు ఇవే

హనుమాన్ చాలీసా పఠనం హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ప్రతిరోజూ పఠించినా, మంగళవారం మరియు శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసాను చదవడం మరింత శ్రేష్ఠమని భక్తులు విశ్వసిస్తారు. మంగళవారం హనుమంతుడికి అంకితమైన రోజు కాగా, శనివారం శనిదేవునికి సంబంధించినదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం హనుమాన్ చాలీసాను ఎప్పుడు, ఎన్ని సార్లు పఠించాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

గ్రంథాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠనానికి కొన్ని నియమాలు ఉన్నాయి. భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో పఠిస్తే బజరంగబలి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. “జో సత బార్ పాఠ్ కర్ కోయీ, ఛూటహి బంది మహా సుఖ్ హోయీ” అనే శ్లోకం ప్రకారం, శుద్ధమైన హృదయంతో హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తే జీవితంలోని భయాలు, బాధలు, కర్మబంధాలు తొలగి మానసిక శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం.

అయితే 100 సార్లు పఠించడం అందరికీ సాధ్యం కాకపోతే, శనివారం రోజున 7 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం కూడా ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అది కూడా కుదరకపోతే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పఠించవచ్చు. అంతేకాదు, శనివారం రాత్రి 8 గంటలకు దీపం వెలిగించి, ప్రశాంతమైన మనస్సుతో ఒక్కసారి హనుమాన్ చాలీసా పఠించి 40 రోజులు నిరంతరం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని గ్రహ దోషాల ప్రభావం తగ్గుతుందని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం ఉంది. ఈ కారణాలతోనే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠనానికి భక్తులు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు.

Tags:    

Similar News