Chandra Grahan 2024: ఈ ఏడాది హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం.. గర్భిణులకు ఈ జాగ్రత్తలు అవసరం..!

Chandra Grahan 2024:ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. వాస్తవానికి 1924లో హోలీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

Update: 2024-03-23 13:30 GMT

Chandra Grahan 2024: ఈ ఏడాది హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం.. గర్భిణులకు ఈ జాగ్రత్తలు అవసరం..!

Chandra Grahan 2024: ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. వాస్తవానికి 1924లో హోలీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే 25 మార్చి 2024 సోమవారం ఏర్పడనుంది. చంద్రగ్రహణం ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:02 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. నిజానికి చంద్రగ్రహణం రోజున నెగటివ్‌ శక్తులు యాక్టివ్‌గా ఉంటాయి. గర్భిణీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో నెగటివ్‌ శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ పరిస్థితిలో ప్రజలు ఇంట్లో పూజలు చేయకూడదు. గర్భిణులు ఇంటి నుంచి బయటకు రావొద్దు. ఈ సమయంలో గ్రహణ ప్రభావం వారి ఆరోగ్యంపైనా, పుట్టబోయే బిడ్డపైనా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 4 గంటల 36 నిమిషాల పాటు అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. కత్తెర, సూదులు, కత్తులు వాడితే పిల్లలపై చెడు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

చంద్రగ్రహణం నేపథ్యంలో గర్భిణులు బయటకు రావొద్దని పండితులు చెబుతున్నారు. గ్రహణం కాంతి శిశువు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో నెగటివ్‌ ఎనర్జీ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఇది శిశువుపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు ఈ సమయంలో నిద్రపోతే అది నేరుగా శిశువు మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో స్త్రీలు వీలైనంత ఎక్కువగా భగవంతుని నామస్మరణ చేయాలి. దీని కారణంగా నెగటివ్‌ శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించలేవు.

Tags:    

Similar News