రోజుకు వెయ్యి మంది భక్తులకే అయ్యప్ప దర్శనం..కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్

నవంబర్ 16 నుంచి శబరిమల స్వామి అయ్యప్ప మండల పూజలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మండల పూజలకు మాల వేసుకుని.. టికెట్టు కొనుక్కుని నేరుగా వెళ్ళే చాన్స్ లేదు.

Update: 2020-10-30 07:57 GMT

నవంబర్ 16 నుంచి శబరిమల స్వామి అయ్యప్ప మండల పూజలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మండల పూజలకు మాల వేసుకుని.. టికెట్టు కొనుక్కుని నేరుగా వెళ్ళే చాన్స్ లేదు.

కరోనా మహమ్మారి కారణంగా శబరిమల స్వామి అయ్యప్ప దర్శనాలకు కేరళ ప్రభుత్వం ప్రత్యెక నిబంధనలు చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం..

- రోజుకు 1,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

- సెలవు రోజులు, మకర సంక్రాంతి సమయంలో గరిష్ఠంగా 5వేల మంది వరకు భక్తులకు అవకాశం కల్పిస్తాఋ.

- కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మండల, మకరవిళక్కు సీజన్‌లో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఉంటుంది.

- దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 టెస్ట్ చేయించుకోవాలి. నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే దర్శనానికిఅనుమతిస్తారు. ఆలయం వద్ద విధులు నిర్వర్తించేవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే కనుక, వారికి చికిత్స కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తాఋ.

- ఒకవేళ, వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.

- మండల పూజలకు నవంబరు 16న ఆలయం తెరుస్తారు. డిసెంబరు 27 వరకు భక్తులను అనుమతిస్తారు.

- తర్వాత మూడు రోజుల పాటు మూసివేసి తిరిగి మకరవిళక్కు పూజల కోసం తెరిచి జనవరి 20న పడిపూజ తర్వాత మూసివేస్తారు.   

Tags:    

Similar News