Panchabutas in Palm: మన చేతుల్లో పంచభూతాల శక్తి..
Panchabutas in Palm: 'అరచేతిలో పంచభూతాలు ఉన్నాయ్' అనే మాట వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ఇందులో ప్రతి అవయవం విశిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది.
Panchabutas in Palm: మన చేతుల్లో పంచభూతాల శక్తి..
Panchabutas in Palm: 'అరచేతిలో పంచభూతాలు ఉన్నాయ్' అనే మాట వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ఇందులో ప్రతి అవయవం విశిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది. మనం తరచూ దానిని గమనించకుండా పోతుంటాము. చేతులు మాత్రమే కాదు, అందులోని ప్రతి వేలు విశేషమైన తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
చేతి వేళ్లకు సంబంధించిన పంచతత్వాలు:
బొటనవేలు – అగ్నితత్వం (Fire)
చూపుడు వేలు – వాయుతత్వం (Air)
మధ్యవేలు – ఆకాశతత్వం (Space)
ఉంగరపు వేలు – భూమితత్వం (Earth)
చిటికెన వేలు – జలతత్వం (Water)
ఈ ఐదు తత్వాలు.. అగ్ని, వాయు, ఆకాశ, భూమి, జలం.. మన శరీరంలో సమతుల్యతగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఈ తత్వాలు చేతివేళ్లలో నిక్షిప్తంగా ఉండటం వల్ల, ఆహారాన్ని చేత్తో తినడం ద్వారా ఆహారంలో ఉన్న శక్తి నేరుగా శరీరానికి అందుతుంది.
ఆచారంలో పరమార్థం:
చేత్తో తినడం కేవలం సంప్రదాయం కాదు. శాస్త్ర పరంగా పరిశీలిస్తే.. చేత్తో తినే ప్రక్రియ. మన జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. మన చేతులు ఉపయోగించే వస్తువుల ప్రభావం కూడా మన మనసు మీద పడుతుంది. ఉదాహరణకి.. తులసి పూసలు పట్టుకుని జపం చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. కలం పట్టుకుంటే సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. అంటే, మన చేతులు సున్నితంగా ఆ వస్తువుల శక్తిని గ్రహించి మన మనస్తత్వాన్ని దానికి అనుగుణంగా మార్చుతాయి.
పెద్దలు పిల్లల తలపై చేతులు ఉంచి ఆశీర్వదించేటప్పుడు, వారి చేతుల్లో ఉన్న శక్తి తరంగాలు చిన్నవారికి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయని నమ్మకం. ఇది కేవలం సెంటిమెంట్ కాదు.. ఒక శక్తి మార్పిడి ప్రక్రియ అని పరిగణించవచ్చు.
చివరగా, మన భవిష్యత్తును సూచించే రేఖలు కూడా మన అరచేతిలో ఉంటాయంటే ఆశ్చర్యమే. హస్తసాముద్రికం అనే శాస్త్రం ద్వారా వాటిని అధ్యయనం చేస్తారు. అందుకే, 'నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది' అనే మాటకు ఆధ్యాత్మికంగా కూడా, శారీరకంగా కూడా భిన్నార్థం ఉంది.