Dream: కలలో కోతి కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా.?
Dream: ప్రతి మనిషికీ నిద్రలో కలలు రావడం సాధారణం. అయితే ఈ కలలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతుంది.
Dream: కలలో కోతి కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా.?
Dream: ప్రతి మనిషికీ నిద్రలో కలలు రావడం సాధారణం. అయితే ఈ కలలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. స్వప్నాలు యాదృచ్ఛికంగా కాకుండా భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సూచనలుగా మారుతాయి. కొన్ని కలలు మనల్ని భయపెడతాయి, మరికొన్ని శుభవార్తలను తీసుకొస్తాయి. అయితే కలలో కోతి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో కోతి కనిపించడం శుభసూచకం. హిందూ మతంలో కోతిని హనుమంతుని రూపంగా భావిస్తారు. అందువల్ల కలలో కోతి కనిపిస్తే హనుమంతుని ఆశీస్సులు మీపై ఉన్నట్లు భావిస్తారు. ఇది త్వరలో మీ జీవితంలో మార్పు వస్తుందనీ, శుభవార్త వింటారనీ, ఆర్థికంగా లాభం పొందవచ్చనీ సూచిస్తుంది.
కలలో కోతి కనిపించే విధానాలవారీగా అర్థాలు:
కోపంగా ఉన్న కోతి: కలలో కోపంగా ఉన్న కోతి కనిపించడం అశుభ సూచకంగా భావిస్తారు. ఇది ఎవరితోనైనా వాదనలు, గొడవలు జరగే అవకాశాన్ని సూచిస్తుంది. ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఆహారం తింటున్న కోతి: ఈ దృశ్యం నష్టాలను సూచిస్తుంది. మీరు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొనవచ్చు. కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురయ్యే సూచన ఇది.
సంతోషంగా ఉన్న కోతి: ఇది శుభ సూచకంగా పరిగణిస్తారు. పాత స్నేహితులతో సంబంధాలు మళ్లీ మెరుగవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
గుంపుగా కోతులు కనిపిస్తే: ఇది ఎంతో శుభసూచకమైంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందని, ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముందని ఈ కల సూచిస్తుంది.