Krishna Janmashtami 2021: గీతాసారాన్ని జీవితానికి అన్వయించుకోవడమే విజయానికి తొలిమెట్టు!

Update: 2021-08-29 00:30 GMT

Krishna Janmashtami 2021

Krishna Janmashtami 2021: ఆగష్టు 30 సోమవారం జన్మాష్టమి. శ్రీకృష్ణుడిని ఆరాధించడంతో పాటు, ఆయన ఇచ్చిన గీతా జ్ఞానాన్ని జీవితంలో అన్వయించుకోవడం ద్వారా, మన అనేక సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో మనం శాంతిని పొందవచ్చు. మహాభారతంలో, అర్జునుడు యుద్ధానికి ముందు తన ఆయుధాలను వదిలివేశాడు. బేలగా మారిపోయాడు. శ్రీకృష్ణుడికి తాను యుద్ధం చేయడం ఇష్టం లేదని చెప్పాడు. కౌరవ పక్షంలో కూడా నా కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు, నేను వారిపై దాడి చేయలేను. అంటూ బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత జ్ఞానాన్ని ఇచ్చాడు.

ఆనందాన్ని తట్టుకోవడం నేర్చుకోండి

ఆనందం.. దుఃఖం శీతాకాలం - వేసవికాలం లాంటివి అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఆనందం.. దుఃఖం రావడం అలాగే, పోవడం అనేది శీతాకాలం మరియు వేసవికాలం రావడం, పోవడం లాంటిది. అందుకే వాటిని తట్టుకోవడం నేర్చుకోవాలి. తప్పుడు కోరికలు, అత్యాశను విడిచిపెట్టిన వ్యక్తి మాత్రమే శాంతిని పొందగలడు. ఈ ప్రపంచంలో ఎవరూ కోరికల నుండి విముక్తి పొందలేరు, కానీ ఎవరైనా ఖచ్చితంగా చెడు కోరికలను వదిలివేయవచ్చు.

ఈ విధానం సాధారణ అర్ధం ఏమిటంటే, మన జీవితంలో ఆనందం.. దుఃఖం వస్తూ, పోతూ ఉంటాయి. వాటి గురించి ఎవరూ ఆందోళన చెందకూడదు. బాధ ఉంటే, దానిని భరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నేడు దుఃఖంగా అనిపించింది.. రేపు సంతోషంగా మారుతుంది. ఈ క్రమం చక్రభ్రమణంలా ఇలాగే కొనసాగుతుంది.

దేవుడిని ధ్యానించండి, కానీ మీ పనిని వదులుకోవద్దు

శ్రీకృష్ణుడు ఓ శ్లోకంలో అర్జునుడికి ఇలా చెప్పాడు.. ''నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ పని కూడా చేస్తూనే ఉండు.'' మీ పనిని మధ్యలో వదిలేయండి.. దేవుని పేరు మాత్రమే తీసుకోండి అని ఎక్కడా చెప్పలేదు. కర్మ చేయకుండా జీవితం సంతోషంగా, విజయవంతంగా ఉండదు. సన్యాసం తీసుకోవడం ద్వారా కూడా సాధించలేని మన కర్మ ద్వారా మాత్రమే మనం ఆ విజయాన్ని పొందవచ్చు. అందుకే దృష్టి కర్మపై ఉండాలి. మీరు కర్మ చేయకపోతే ఈ జీవితం పూర్తి కాదు.

మహాభారత యుద్ధం సంక్షిప్త సారాంశం ఇదే..

శ్రీకృష్ణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కౌరవులు..పాండవుల మధ్య యుద్ధం నివారించబడలేదు. ఇరుపక్షాల సైన్యాలు ముఖాముఖిగా వచ్చాయి. కౌరవుల సైన్యంలో, దుర్యోధనుడు, శకునితో పాటు భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వంటి కృపాచార్యులు గొప్పవారు. అర్జునుడు కౌరవ పక్షంలో తన వంశానికి చెందిన గౌరవనీయులైన వ్యక్తులను చూసి బాధపడ్డాడు. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులపై నేను బాణాలు వేయలేనని అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు. ఇలా చెబుతూ అర్జునుడు తన ఆయుధాలను వేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత జ్ఞానాన్ని ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడు ఇచ్చిన గీతాజ్ఞానంలోని సారాంశాన్ని అర్ధం చేసుకుంటే.. మనిషి సుఖ దుఃఖాలకు ఎలా అతీతుడుగా ఉండొచ్చో నేర్చుకోగలుగుతాడు. ప్రతి వ్యక్తీ గీతాసారాన్ని తెలుసుకున్న రోజున ప్రపంచంలోని మానవుల ధోరణి మారిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. భగవాన్ శ్రీ కృష్ణుడు సకల మానవాళికి ఇచ్చిన అద్భుత బహుమతి భగవద్గీత. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఒక్కసారి భగవద్గీత గొప్పతనాన్ని తలుచుకోవదమూ సముచితమే కదా!

Tags:    

Similar News