Sravana Masam 2025: శ్రావణ మాసం పూజలకు కాశీ వెళ్లాలనుకుంటున్నారా? అయితే.. ఈ వస్తువులు క్యూలైన్‌లోకి తీసుకెళ్లకూడు..కొత్త రూల్స్ తీసుకొచ్చిన టెంపుల్ సిబ్బంది
Sravana Masam 2025: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ మాసంలో జరిగే ప్రత్యేకమైన పూజలకోసం అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. భక్తులందరు ప్రశాంతంగా దర్శనం చేసేందుకు వీలుగా కొత్త ప్రోటోకాల్‌ని తీసుకొచ్చారు.
Sravana Masam 2025: శ్రావణ మాసం పూజలకు కాశీ వెళ్లాలనుకుంటున్నారా? అయితే.. ఈ వస్తువులు క్యూలైన్‌లోకి తీసుకెళ్లకూడు..కొత్త రూల్స్ తీసుకొచ్చిన టెంపుల్ సిబ్బంది
Sravana Masam 2025: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ మాసంలో జరిగే ప్రత్యేకమైన పూజలకోసం అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. భక్తులందరు ప్రశాంతంగా దర్శనం చేసేందుకు వీలుగా కొత్త ప్రోటోకాల్‌ని తీసుకొచ్చారు. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ఉత్తరాదిలో పౌర్ణమి నుంచి పౌర్ణమి తిధి వరకు ఉన్న సమయాన్ని నెల పరిగణిస్తారు. దీని ప్రకారం జూలై 11 వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. దీంతో ఉత్తరాది ప్రాంతం నుంచి వేలమంది భక్తులు ఈ శ్రావణమాస పూజల కోసం శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. అయితే ఈ సారి దేవాలయంలో భారీ స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు.
ఈ సారి శ్రావణ మాసంలో అన్నిరకాల ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా నిషేధించారు. అదేవిధంగా భక్తులకు ఉదయం 4 గం. నుంచి 5 గంల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శకట దర్శన సౌకర్యం లభిస్తుంది. అయితే శ్రావణ మాసంలోని సోమవారం, ఇతర పండుగల సమయం అప్పుడు మాత్రం ఈ శకట దర్శనం ఉండదు.
ధర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం క్యూలో నిలబడాల్సి వస్తుంది. అయితే ఇలా ఆకలితో నిలబడకుండా ఉండేందుకు భక్తుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
దీంతోపాటు క్యూలో నిలబడినప్పుడు అలాగే ఆలయంలోకి అడుగుపెట్టేముందు కొన్ని వస్తువులను తీసుకుని రావద్దని కూడా భక్తులకు సూచించారు. డిజిటల్ గడియారాలు, మొబైల్స్, ఇయర్ ఫోన్లు, సిగరెట్లు, మత్తు పదార్ధాల, బ్యూటీ ప్రొడక్ట్స్ , లగేజీ బ్యాగులు వంటివి లోపలికి తీసుకుని రావడం నిషేధం.