History of Kalikamata Temple : చంపానేర్-పావగఢ్ కాళికామాత ఆలయం విశేషాలు

History of Kalikamata Temple : మన భారతే దేశంలో ఎన్నో అద్బుతమైన హిందూ ఆలయాలు ఉన్నాయి. కొండ కోనల్లో, జలపాతాల్లో, ప్రకృతి అందాల నడుమ ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి.

Update: 2020-08-08 06:50 GMT
కాళికామాత ఆలయం

History of Kalikamata Temple : మన భారతే దేశంలో ఎన్నో అద్బుతమైన హిందూ ఆలయాలు ఉన్నాయి. కొండ కోనల్లో, జలపాతాల్లో, ప్రకృతి అందాల నడుమ ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి పావగఢ్ కొండపై ఉన్న కాళికామాత దేవాలయం. ఈ ప్రసిద్ధమైన దేవాలయం భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన చంపానేర్-పావగఢ్ ప్రదేశాలైన గుజరాత్ రాష్ట్రంలోని పంచ్‌మహల్ జిల్లాలో హలోల్ వద్ద ఉన్నాయి. ఈ ఆలయాన్ని 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సంపాదించింది. ఈ ప్రాంతంలోనే ఎత్తయిన కొండపై ఉన్న కోట క్రీ.శ.16వ శతాబ్దంలో గుజరాత్‌కు రాజధానిగా విలసిల్లింది. ఈ పరిసర ప్రాంతంలోనే క్రీ.శ.8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు నాటి ఎన్నో కోటలు, రాజప్రసాదాలు, పురాతన కట్టడాలు, మతపరమైన కట్టడాలు మన్నగినవి నేటికీ చూడవచ్చు.

కాళికామాత దేవాలయం

చంపాగఢ్-పావనేర్ ప్రాంతంలో అతిముఖ్యమైన పర్యాటక ప్రదేశం కాళికామాత దేవాలయం. 550 మీట్లర్ల (1523 అడుగులు) ఎత్తయిన కొండపై ఉన్న ఈ దేవాలయ సందర్శనకై దూరప్రాంతాల నుంచి ఏడాది పొడవునా పర్యాటకులు వస్తుంటారు. కొండపై వెళ్ళడానికి రోప్‌వే సౌకర్యం ఉండటం మరొక ఆకర్షణ. రోప్‌వే దిగిన తరువాత మళ్ళీ 250 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. వాహనాలు వెళ్ళే గుట్తపై ఉన్న పీఠభూమి ప్రాంతాన్ని మాచి ప్రాంతంగా పిలుస్తారు.

చంపానేర్-పావగఢ్ చరిత్ర

వనరాజ్ చావడ రాజు తన భార్య చంపా పేరిట పావగఢ్ కొండ దిగువ ప్రాంతంలో చంపానేర్‌ను స్థాపించాడు. ఆ తరువాత పటాయి రావల్ కుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించింది. నవరాత్రి ఉత్సవ సమయంలో కాళికామాత నృత్యం చేస్తుండగా చివరి పటాయి రాజు జైసింహ్ చెడుచూపుల వల్ల దేవత శాపానికి గురైనట్లు, తత్ఫలితంగా గుజరాత్ చక్రవర్తి ముహమ్మద్ బెగ్డా పావగఢ్‌ను ఆక్రమించినట్లు కథ ప్రచారంలో ఉంది. పటాయి రాజు ముహమ్మద్ బెగ్డా చేతిలో ఓడి చంపబడినాడు. ఆ తరువాత కొద్దికాలానికి బెగ్డా తన రాజధానిని దౌత్యకారణాల వల్ల అహ్మదాబాదు నుంచి చంపానేర్‌కు మార్పుచేశాడు. రాజధానిని చంపానేర్‌కు మార్చిన తరువాత బెగ్డా ఈ ప్రాంతంలో పలు కట్టడాలను నిర్మించాడు. అందులో ముఖ్యమైనవి చంపానేర్ కోట, ఓరా మసీదు, మాండవి, కీర్తిస్తంభము, షాల్క్ దేవాలయం, జామా మసీదు, నగీనా మసీదు, కేవ్డా మసీదు మొదలగునవి ఉన్నాయి.

Tags:    

Similar News