Sakthivanesvara Temple : పార్వతి దేవి శివుడిని ఆలింగనం చేసుకున్న ఈ ఏకైక దేవాలయం ఎక్కడుందో తెలుసా?

Update: 2020-10-04 09:55 GMT

Sakthivanesvara Temple : భారత దేశంలో ఎంతో ప్రసిద్ది గాంచిన ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500దేవాలయకు మించి ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర గల ఆలయాల్లో ఒక ఆలయం కుంభకోణంకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో ఓ ఆయలం ఉంది. అదే శక్తివనేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే శివుడు పార్వతి కలిసి శివలింగకారంలో ఉంటారు. ఇదే ఈ ఆయలం ప్రత్యేకత. దీంతో ఈ దేవాలయం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ది చెందినది. శక్తివనేశ్వర ఆలయానికి నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఈ ఆలయానికి ఇంకో విషేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఈ ఆలయానికి ఎవరైనా ప్రేమికులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారితోనే వివాహంభాగ్యాన్ని ప్రసాదిస్తాడంట.

అయితే ఆ దేవాలయం ఎక్కడ వుంది పూర్తి విశేషాలు తెలుసుకుందాం. ఈ దేవాలయం పేరు శక్తివనేశ్వర దేవాలయం. మాహాశివుడు లింగాస్వరూపంలో ఈ ఆయలంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. ఈ దేవాలయం జీవితాన్ని కరుణించే శక్తియుత దేవాలయం అని ప్రసిద్ధిపొందినది. ఇక్కడి వచ్చే భక్తులు శివుని అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తుండడంతో వారి కోరికలు తీరుస్తారని ప్రతీతి.

ఈ దేవాలయ రహస్యం..

శివపార్వతులు పార్వతిదేవి పెరిగి పెద్దదవుతుంది. ఆ తరువాత ఒకనాడు పార్వతీ దేవి భోలా శంకరున్ని చూస్తుంది. అప్పటి నుంచి ఆ శివయ్యే తన భర్త అని భావించి ప్రతి క్షణం మహాశివుని గురించి ఆలోచిస్తూవుంటుంది. పార్వతి శివునిప్రేమలోనే తన్మయత్వంతో అతనినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. శివున్ని పెళ్లాడేందుకు ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. క్రమంగా తపస్సు తీవ్ర రూపం దాల్చడం మాత్రమే కాదు ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును ఆచరిస్తుంది. ఇది గమనించిన శివుడు పార్వతీ దేవికి ప్రసన్నుడవుతాడు. కానీ ప్రత్యక్షం కాలేదు. దీంతో పార్వతీ దేవి మరింత కఠినంగా తపస్సును కొనసాగిస్తుంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్నిరూపంలో దర్శనమిస్తాడు. ఆ పరమశివున్ని అగ్ని రూపంలో దర్శించిన పార్వతి కాస్త కూడా జంకకుండా ఆ అగ్నిరూపాన్నే కౌగిలించుకుంటుంది. అయితే ఆమె తపస్సు చేసిన స్థలంలోనే ఈ ఆలయం వెలసింది. దాంతో ఆ పరమేశ్వరుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతిదేవిని వివాహంచేసుకుంటాడు. ఈ విధంగా ఆది శక్తియైన పార్వతి దేవి తాను ఇష్టపడిన శివుని తన పతిగా దక్కించుకుంటుంది. అయితే ఇక్కడి శివలింగం ఎలా ఉంటుందంటే పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ మహిమాన్విత దేవాలయం ఎక్కడ వుంది?

ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరుజిల్లాలో కుంభకోణం పట్టణం నుండి సుమారు 7కిమీ ల దూరంలో వున్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయంగా వెలసింది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే తమిళ నాడు రాష్ట్రంలోని కుంభకోణం రైల్వేస్టేషన్ నుంచి చేరుకోవచ్చు. అదే విధంగా తంజావూరు విమానాశ్రయం నుంచి కూడా ఆలయానికి చేరుకోవచ్చు.

Tags:    

Similar News