దేవి నవరాత్రుల ప్రాముఖ్యత

Update: 2020-10-17 06:12 GMT

నవరాత్రి , విజయ దశమి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.

నవరాత్రి ప్రాముఖ్యత

నవరాత్రులు దుర్గా దేవి ఉత్సవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నవరాత్రి పండుగ తొమ్మిది రాత్రుల పండుగ, చివరి రోజున అంటే విజయదశమి నవరాత్రి పండుగ ముస్తుంది. ఈ పదిదినాలలోనూ, మహిషాసురమర్ధిని అయిన దుర్గా మాతను అనేక రూపాలలో ఆరాధనతో, భక్తితో పూజిస్తారు.

నవరాత్రి సంప్రదాయాలు

నవరాత్రులను సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి, పౌష్య/మాఘ నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి, వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.

1. వసంత నవరాత్రి : వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) తొమ్మిది రూపాల శక్తి మాతని (దేవీ మాత) ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.

2. గుప్త నవరాత్రి : ఆషాఢ, గాయత్రి, శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల శక్తి మాతను పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

3. శరన్నవరాత్రులు : అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి అని అంటారు. ఈ ఉత్సవాన్ని అశ్విని మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో అంటే శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబరు-అక్టోబరు జరుపుకుంటారు.

4. పౌష్య నవరాత్రి : పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల దేవీ మాతను పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు. దీనిని పుష్య మాసంలో వచ్చే పౌష్య నవరాత్రి అంటారు. పౌష్య శుక్ల పక్షంలో పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.

5. మాఘ నవరాత్రి : గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని, మాఘమాసంలో తొమ్మిది రూపాలలో దేవీ మాతను తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన జరుపుకుంటారు.

మూడు వివిధ అంశాల మహోన్నతమైన దేవిని ఆరాధించడానికి నవరాత్రిని మూడు రోజుల సమూహంగా విభజిస్తారు.

మొదటి మూడు రోజులు

దేవిని మనలో ఉన్న పాపాలను నాశనం చేయడం కోసం, ఒక ఆధ్యాత్మిక శక్తిగా వేరు చేస్తారు. ఆ శక్తిని దుర్గ అనీ, కాళి అనీ గుర్తిస్తారు.

రెండవ మూడు రోజులు

మాతను ఆధ్యాత్మిక సంపదను ఒసగే లక్ష్మీ మాతగా ఆరాధిస్తారు. లక్ష్మీ మాత సంపదకు దేవత, ఆమెను తన భక్తులకు తరిగిపోని సంపదను ఇచ్చే శక్తిగల దేవతగా భావిస్తారు.

చివరి మూడు రోజులు

చివరి మూడు రోజులను చదువుల తల్లి అయిన సరస్వతిని పూజించడంలో గడుపుతారు. జీవితంలో అన్ని రంగాలలోనూ విజయం సాధించడానికి అమ్మవారి ఆశీర్వాదం పొందడం కోసం పూజిస్తారు.

Tags:    

Similar News