Lord Surya: ఆదివారం ఈ పనులు చేయొద్దు.. చేశారో బతుకు బస్టాండే!

Lord Surya: సూర్యుడి అనుగ్రహం పొందాలంటే పాటించాల్సిన నియమాలు ఇవే

Update: 2025-07-13 08:26 GMT

Lord Surya: ఆదివారం ఈ పనులు చేయొద్దు.. చేశారో బతుకు బస్టాండే!

Lord Surya: ఆదివారం వచ్చింది అంటే చాలా మంది ఫుల్ రిలాక్స్, ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోతుంటారు. అయితే పూర్వీకుల మాటల ప్రకారం, ఆదివారం రోజున కొన్ని పనులు అసలు చేయరాదట. ఎందుకంటే ఈ రోజు సూర్య భగవానునికి అంకితమైన పవిత్ర దినం. ఆయన మన కర్మలను నిత్యం గమనిస్తూ, ప్రతి ఒక్కరి జీవితం మీద ప్రభావం చూపుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

పురాణాల ప్రకారం సూర్యుడు ఆదివారానికి అధిపతి. ఆయన భార్య ఛాయాదేవి, పిల్లలు శని, యముడు. అందువల్ల ఆదివారాన్ని గౌరవంతో గడపాలని, ఆ రోజున కొన్ని పనులను చేయకుండా ఉండాలని రుషులు సూచించారు.

ఆదివారం అసలు చేయకూడని పనులు:

♦ మద్యం సేవించకూడదు

♦ మాంసాహారాన్ని తీసుకోరాదు

♦ జుట్టు కత్తిరించడం, గోర్లు తొలగించడం వంటివి నివారించాలి

♦ భార్యతో శృంగార సంబంధానికి దూరంగా ఉండాలి

ఈ రోజు సాత్విక ఆహారంతో, ధ్యానం, ప్రార్థనలో నిమగ్నమవడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు. ఆదివారం ఆదిత్య హృదయం పఠనానికి అత్యంత శుభదాయకమైన రోజుగా పరిగణించబడుతుంది.

చేయాల్సిన శుభ కార్యాలు:

♦ తెల్లరంగు పదార్థాలు దానం చేయడం (బియ్యం, పాలు, పెరుగు)

♦ ఉప్పులేని వంటలు చేసి తినడం

♦ ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠించడం

ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి.. శ్రీరాముని కథే సాక్ష్యం

త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి ముందుగా ముమ్మారు ఆదిత్య హృదయాన్ని పఠించి, దైవ అనుగ్రహంతో విజయం సాధించినట్టు వాల్మీకి రామాయణం చెబుతోంది. ఈ శ్లోకాన్ని ప్రతీ ఆదివారం పఠిస్తే గ్రహబాధలు, శని దోషాలు, యమ భయాలు తొలగిపోతాయని నమ్మకం.

పండితుల అభిప్రాయం ప్రకారం, ఆదివారం రోజున ఈ నియమాలు పాటిస్తే ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్య పరిరక్షణ, పుణ్య ఫలితాలు లభిస్తాయి. కనుక సెలవు రోజు మద్యం, మాంసం ఎంజాయ్‌కి కాదు — సూర్యారాధనకు అంకితం చేయాల్సిన పుణ్యదినంగా భావించాలి.

Tags:    

Similar News