Bhagavad Gita: శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన జీవిత పాఠాలు – నేటికీ మార్గదర్శకం!

మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో అర్జునుడు నిస్సహాయంగా నిలిచిపోయిన వేళ, శ్రీకృష్ణుడు ఇచ్చిన గీతోపదేశం యుగయుగాల పాటు మార్గదర్శకంగా నిలిచింది. మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాలను స్పష్టంగా చెప్పిన ఆ బోధనలు నేటికీ వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తున్నాయి. జీవితం మెరుగుపరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన గీతలోని 6 ముఖ్యమైన బోధనలు ఇవి –

Update: 2025-08-18 12:45 GMT

1. ఫలితం గురించి ఆందోళన పడొద్దు

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” – కర్మ చేయడం మన కర్తవ్యం. కానీ ఫలితంపై ఆసక్తి చూపకూడదు. కృషి మీద దృష్టి పెట్టాలి, ఫలితం సహజంగానే వస్తుంది.

2. ఆలస్యం చేయొద్దు

ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయొద్దు. సమయానికి పూర్తి చేసే వారు మాత్రమే విజయాన్ని అందుకుంటారు. ఆలస్యం చేస్తే జీవితాంతం వెనకబడిపోతాం.

3. మీ మీద నమ్మకం ఉంచుకోండి

మన సామర్థ్యాలను గుర్తించి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దానిపై విశ్వాసం ఉంచినవారే విజయాన్ని అందుకుంటారు.

4. మనస్సును అదుపులో ఉంచుకోండి

ప్రశాంతమైన మనస్సుతో చేసిన పనికే ఫలితం ఉంటుంది. ఆందోళన, తొందర, కోపం మన పనిని చెడగొడతాయి. మనస్సు అదుపులో ఉంటే జీవితమే సులువవుతుంది.

5. సత్య మార్గంలో నడవండి

సత్యం ఎప్పటికీ ఓడిపోదు. కష్టాలు ఎదురైనా సత్యం అనుసరించినవారికి చివరికి విజయం లభిస్తుంది.

6. దేవునిపై విశ్వాసం ఉంచుకోండి

భక్తి, విశ్వాసం మనసుకు ప్రశాంతత ఇస్తాయి. భగవంతుడిపై నమ్మకం పెట్టుకున్నవాడు ఎప్పుడూ నిరాశ చెందడు.

గీతలోని ఈ ఆరు బోధనలు కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, జీవిత విజయానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి.

Tags:    

Similar News