Clock Vastu Tips: ఇంట్లో గోడ గడియారం ఈ దిక్కున పెట్టకండి.. తర్వాత చాలా బాధపడుతారు..!

Clock Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు దాని దిశలో ఉండాలి. లేదంటే కుటుంబంలో చాలా సమస్యలు మొదలవుతాయి. ఇంట్లో గోడ గడియారాన్ని చాలామంది ఇష్టమొచ్చిన దిశలో పెడుతారు.

Update: 2024-01-19 14:00 GMT

Clock Vastu Tips: ఇంట్లో గోడ గడియారం ఈ దిక్కున పెట్టకండి.. తర్వాత చాలా బాధపడుతారు..!

Clock Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు దాని దిశలో ఉండాలి. లేదంటే కుటుంబంలో చాలా సమస్యలు మొదలవుతాయి. ఇంట్లో గోడ గడియారాన్ని చాలామంది ఇష్టమొచ్చిన దిశలో పెడుతారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. గడియారానికి సంబంధించిన వాస్తు పద్దతులు కచ్చితంగా పాటించాలి. ఎందుకంటే గడియారం సమయాన్ని తెలుపుతుంది. దీనివల్ల సకాలంలో పనులు జరుగుతాయి.

నేటి కాలంలో ప్రతి చేతిలో మొబైల్ ఉంటుంది. దీని ద్వారా సమయం తెలుసుకోవచ్చు. కానీ పూర్వం ఇంట్లో గడియారం ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా భావించేవారు. లెక్క ప్రకారం ప్రతి ఇంట్లో ఒక గడియారం ఉండాలి. దీనివల్ల అన్ని పనులను సకాలంలో ప్రారంభించవచ్చు అలాగే పూర్తి చేయవచ్చు. అయితే దీనిని గోడకు వేలాడదీసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ రోజు గడియారం నియమాలను తెలుసుకుందాం.

మీరు ఇంట్లో గోడ గడియారాన్ని తప్పు దిశలో ఇన్స్టాల్ చేయకూడదు. లేదంటే అది మీ దురదృష్టానికి కారణం అవుతుంది. వాస్తు ప్రకారం.. ఇంట్లో వస్తువులను సరైన స్థలంలో ఉంచకపోతే అవి నెగిటివ్‌ ఎనర్జీని ప్రసరిస్తాయి. ఇది ఆ ఇంట్లో నివసించే ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గోడ గడియారాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది.

వాస్తు ప్రకారం ఇల్లు లేదా కార్యాలయం దక్షిణ గోడపై గడియారాన్ని ఉంచకూడదు. ఎందుకంటే హిందూ గ్రంధాల ప్రకారం దక్షిణ దిశను మృత్యుదేవత దిశగా పరిగణిస్తారు. వ్యాపార స్థలంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల అడ్డంకులు రావడం మొదలవుతాయి. పురోగతి ఆగిపోతుందని నమ్ముతారు. అదేవిధంగా ఇంటి దక్షిణ గోడపై గడియారాన్ని ఉంచడం అక్కడ నివసించే ప్రజలపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుంది. దక్షిణం వైపు కాకుండా ఇంటి ప్రధాన ద్వారం పైన కూడా గడియారాన్ని పెట్టకూడదు. వాస్తు ప్రకారం గడియారాన్ని తలుపు పైన ఉంచకూడదు. ఆగిపోయిన విరిగిపోయిన గడియారాలను ఇంట్లో నుంచి తీసివేయాలి.

Tags:    

Similar News