Vastu Tips: నైరుతి దిశలో పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

Vastu Tips: సనాతన హిందూ సంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి చాలామంది వాస్తు ప్రకారం ఏ పనైనా చేస్తున్నారు.

Update: 2024-01-12 01:30 GMT

Vastu Tips: నైరుతి దిశలో పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

Vastu Tips: సనాతన హిందూ సంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి చాలామంది వాస్తు ప్రకారం ఏ పనైనా చేస్తున్నారు. ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక దిశ ఉంటుంది. అది అక్కడ ఉంచితేనే మంచిది లేదంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఏ వస్తువు ఏ దిశన పెట్టాలో కచ్చితంగా తెలిసి ఉండాలి. వాస్తు ప్రకారం ఇంటి నైరుతి దిశలో కొన్ని వస్తువులు పెట్టకూడదు. ఎందుకంటే నైరుతి దిశను రాహు-కేతువుల దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో ఉంచిన వస్తువులు జీవితంపై నెగిటివ్‌ ప్రభావాన్ని చూపుతాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి నైరుతి దిశలో ఆలయం లేదా పూజగది ఉండకూడదు. ఈ దిక్కున ప్రతిష్ఠించిన దేవతామూర్తులను పూజించినా ఫలితం ఉండదు. ఈ దిశలో మనస్సును అదుపులో ఉంచలేరు. దీని కారణంగా పూజ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ దిశలో మనస్సు ఏకాగ్రతగా ఉండదు. మనస్సు ఎల్లప్పుడూ సంచరిస్తూనే ఉంటుంది. ఈ దిశలో చదువుకోవడం వల్ల పిల్లలకు ఏమీ గుర్తుండదు. కాబట్టి స్టడీ రూం ఈ దిక్కున ఉండకూడదు.

అతిథి గదిని కూడా నైరుతి దిశలో నిర్మించకూడదు. వాస్తు ప్రకారం రాహువు, కేతువుల దిశ కారణంగా ఈ దిశలో నివసించే వ్యక్తి మనస్సు, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. అందువల్ల ఈ దిశలో అతిథి గదిని నిర్మించకుండా ఉండాలి. ఇంటి నైరుతి దిశలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోశాలు పెరుగుతాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతి దిశలో ఎప్పుడూ మరుగుదొడ్డి నిర్మించకూడదు. ఇది నెగిటివ్‌ ఎనర్జీని తెస్తుంది. దీని కారణంగా ఇంట్లో నివసించే వ్యక్తుల పురోగతి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఇంటి ప్రజలు ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారు.

Tags:    

Similar News