Samsung Mother's Day Gift: అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు..

మదర్స్ డే సందర్భంగా సామ్‌సంగ్ ఓ మంచి ఆఫర్ ని తీసుకొచ్చింది.

Update: 2020-05-10 07:34 GMT
Samsung Smart Phones (File Photo)

మదర్స్ డే సందర్భంగా సామ్‌సంగ్ ఓ మంచి ఆఫర్ ని తీసుకొచ్చింది. ఖరీదైన ఫోన్లు, ఫ్రిజ్, ఎసి, వాషింగ్ మెషిన్, టివి మొదలైన ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకోవాలనుకునే వారికి భారీ తగ్గింపు ఇస్తుంది. ఇందుకోసం శామ్సంగ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో మదర్స్ డే విత్ గెలాక్సీ ఆఫర్‌ను నడిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆఫర్ లో స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు.

Mother's Day with galaxy ఆఫర్...

మే 7వ తేదీన ప్రారంభమయిన ఈ ఆఫర్ మే 11వ తేదీన ముగియనుంది. ఇందులో భాగంగా ప్రీమియం ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 9 స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు చేయాలనుకునే వారు మదర్స్ డే ఆఫర్ ద్వారా సగం కంటే తక్కువ ధరలకు కొనుగోలు చేసుకోవచ్చు.

గెలాక్సి యొక్క అసలు ధరకు వస్తే రూ.62,000 ఉంది. కానీ మదర్స్ డే ఆఫర్ సందర్భంగా ఈ ఫోన్ కేవలం రూ .22,999 కు వినియోగదారులకు లభిస్తుంది. సుమారుగా రూ. 39,001లను వినియోగదారులు సేవ్ చేసుకోవచ్చు.

గెలాక్సీ ఎస్ 9 ఫోన్ ఫీచర్స్..

♦ డిస్‌ప్లే 5.8 అంగుళాలు

♦ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

♦ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 1.7GHz

♦ బ్యాటరీ ఎంఏహెచ్ 3000

♦ సూపర్ స్పీడ్ డ్యూయల్ పిక్సెల్స్ తో 12 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా

♦ సెల్ఫీ కోసం ఫోన్ ముందు 8 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా ఇచ్చారు.


Tags:    

Similar News