ఈ లక్షణాలూ కరోనా వైరస్ ఉనికిని చెబుతాయి.. అవేంటంటే..

ఇప్పటి వరకూ (CDC) "ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" సంస్థ కరోనాకి జ్వరం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం మాత్రకే లక్షణాలుగా ఉన్నాయని తెలిపింది.

Update: 2020-04-27 07:28 GMT
Representational Image

కరోనా కంటికి కనిపించదు. వ్యాప్తి తెలీదు. కోవిడ్ మన శరీరంలో ఉందని తెలిపే లక్షణాలు ఇవీ అని కచ్చితంగా చెప్పలేని పరిస్థతి. అయితే, ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరం వంటి మూడు లక్షణాలను ప్రధానంగా కరోనా గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా మరికొన్ని లక్షణాలు కూడా కరోనా వ్యాధి సోకిన వారిలో కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వాటిలో చాలా ముఖ్యమైనది ఒళ్ళు గగుర్పోడచటం.. అంటే శరీరం మీద ముఖ్యంగా చేతుల మీద రోమాలు నికబోడుచుకున్నట్టు అయి చిన్న బొడిపెల్లా వస్తాయి. ఇలాంటి మరిన్ని లక్షణాలను గుర్తించారు శాస్త్ర వేత్తలు.  

ఇప్పటి వరకూ (CDC) "ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" సంస్థ కరోనాకి జ్వరం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం మాత్రకే లక్షణాలుగా ఉన్నాయని తెలిపింది. కానీ మళ్లీ పరిశోధనలు చేసిన సీడీసీ కరోనా వచ్చేముందు ఉండే మరో 6 కొత్త లక్షణాలను తెలిపింది. సాధారణంగా చలివేసినప్పుడు, ఏదైనా అనుకోని సంఘట చూనినపుడు ఏ విధంగానైతు రోమాలు నిక్కబొడుస్తాయో కరోనా సోకినపుడు కూడా ఈ లక్షణం కనపడుతుందంటున్నారు. కానీ సాధారణంగా రమాలు నిక్కబొడిస్తే అవి కేవలం అవి ఐదారు సెకండ్లు ఉండి మాయమవుతాయి. కానీ కరోనా మహమ్మారి సోకినపుడు అవి తరచుగా వస్తూనే ఉంటాయని చెపుతున్నారు "ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" (CDC). ఈ సంస్థ ఏవిషయాన్ని కూడా అంత త్వరగా బయట పెద్దదు, అలా చెప్పిందంటే వంద శాతం పరిశోధనలు చేసిన తర్వాతే స్పష్టతనిస్తుంది.

ఇక ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజుల పాటు అది కరోనానో కాదో తెలుసుకోవడానికి ఆగాలి. అంతే కాదు లక్షణాలు కనిపిస్తే మంచి ఆహారం తీసుకుని, హాయిగా నిద్రపోయి ఒంట్లో ఉన్న నలతని పోగొట్టుకోవాలి. అయినా వారిలో ఉన్న లక్షణాలు తగ్గకుండా అలాగే ఉంటే అప్పుడు వైద్యులను సంప్రదించాలి. దాదాపుగా కొంత మంది మనుషుల్లో వైరస్ ప్రవేశించి కొద్ది గంటలో, రెండు మూడు రోజుల్లో ఉండి అది నాశనం అవుతుందని తెలుపుతున్నారు. ప్రజలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన వైరస్ ను పెరగనివ్వకుండా చంపెయ్యొచ్చు.

ఇక ప్రస్తుతం సీడీసీ చెప్పిన కొత్త లక్షణాల్లోకెళితే

తలనొప్పి

♦ కండరాల నొప్పి

♦ చిల్స్‌తో కూడిన వణుకు మళ్లీ మళ్లీ రావడం.

♦ చిల్స్ (Chills)... గూస్‌బంప్స్ రావడం.

♦ గొంతులో గరగరరుచి, వాసన తెలియకపోవడం ఉంటాయి.

ఇక పాతలక్షణాలను చూసుకుంటే

♦ జ్వరం

♦ దగ్గు

♦ ఊపిరి ఆడకపోవడం

ఈ లక్షణాలు కనిపిస్తాయి. పాత లక్షణాలు, కొత్త లక్షణాలు అన్ని కలుపుకుని మొత్తం 9 లక్షణాలయ్యాయి. ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకుని వైద్యులను సంప్రదించాలి.




 


Tags:    

Similar News