మాస్క్ వేసుకున్న గ్రహశకలం.. కరోనా వేళ కనిపించిన అంతరిక్ష అద్భుతం!!

Update: 2020-04-27 03:38 GMT
an asteroid looks like wearing facemask (image from Arecibo Radar tweet)

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మొత్తం మానవాళి అంతా కరోనా దెబ్బకు బెంబేలెత్తి పోతున్నారు. ఎటు చూసినా కరోనా గురించిన విశేషాలే చక్కర్లు కొడుతున్నాయి. అసలు కరోనా లేని మీడియా ప్రస్తుతం కనిపించడం లేదు.

ఇక అంతరిక్ష పరిశోధకులూ కరోనా విషయంలో అప్రమత్తంగానే ఉన్నారు. వారి పరిశోధనలు తగిన జాగ్రత్తలు తీసుకుని కొనసాగిస్తున్నారు.

ఇటీవల అంతరిక్షంలో ఒక అద్భుత దృశ్యాన్ని Arecibo Observatory ఫోటోలలో బంధించింది. అక్కడి శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా ఒక గ్రహశాకలాన్ని గమనించి ఫోటో తీశారు. ఆ గ్రహశకలం అచ్చు మాస్క్ మాదిరిగా కనిపించింది. దీంతో ఆ శాస్త్రవేత్తల బృందం ఈ ఫోటోను తమ ట్విట్టర్ ఎకౌంట్ లో ఉంచారు. ఆ ఫోటోతో పాటు మాస్క్ లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న తమ ఫొతొలనూ ఆ ట్వీట్ కి జతచేశారు. ఇంకా ఆ ట్వీట్ లో వాళ్ళు ఏమన్నారంటే..

''మేము 52768 (1998 OR2) గ్రహశాకలాన్ని పరిశోధిస్తున్నపుడు మాకు ఇది మాస్క్ వేసుకున్న మనిషి ఆకారంలో కనిపించింది. కరోనా వైరస్ ప్రభావంతో మేము మా విధులను మాస్క్ లు ధరించి జాగ్రత్తలతో నిర్వహిస్తున్నాము. ఈ సమయంలో మాకు ఇలా ముసుగు వేసుకున్నట్టు గ్రహశకలం కనిపించింది''

రు ఫోటో తీసిన గ్రహశకలం 1.5 కిలోమీటర్ల వెడల్పుతో ఉంది. అంటే దాదాపు ఎవరెస్ట్ శిఖరం సైజులో సగం సైజు. ఇది భూమిని ఈ వారంలో చేరుకునే అవకాశము ఉందని భావిస్తున్నారు.

సీఎన్ఎన్ చెబుతున్న దాని ప్రకారం ఈ గ్రహ శకలాన్ని 1998లో గుర్తించారు. 52768 (1998 OR2) గా పిలుస్తున్న ఈ గ్రహశకలం ఏప్రిల్ 29 న, ఇది భూమికి 3.9 మిలియన్ మైళ్ళ దూరంలో వెళుతుందని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News