శభాష్ ఆటో డ్రైవరన్న..

ఈరోజుల్లో సాటివారికి సాయం చేసే వారిని ఎంతమందిని చూస్తున్నాం? ఈకాలంలో ఎవరి స్వార్థం వారికే ఉంటుంది. అలాంటింది ఎదుటువారికి సహయం చేద్దాం అనే ఆలోచన వందల్లో, ఒక్కరికో.. ఇద్దరికో ఉంటుంది.

Update: 2019-08-27 04:09 GMT

ఈరోజుల్లో సాటివారికి సాయం చేసే వారిని ఎంతమందిని చూస్తున్నాం? ఈకాలంలో ఎవరి స్వార్థం వారికే ఉంటుంది. అలాంటింది ఎదుటువారికి సహయం చేద్దాం అనే ఆలోచన వందల్లో, ఒక్కరికో.. ఇద్దరికో ఉంటుంది. 'స్వార్ధంతో పరుగులు తీసే ప్రపంచం ఎవరికోసం ఆగదు అని ఓ సినిమాలో చెప్పిన డైలాగ్' కానీ ఈయన చేసిన పనులు చూస్తే పై అభిప్రాయాలన్ని తప్పు అనిపిస్తుంది. ఆయన చేసే సేవలు అటువంటివి. ఇక వివరాల్లోకి వెళితే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు మహ్మద్ హనీఫ్(83). ఇతడి వృత్తి ఆటో నడపడం. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తునే.. పేదరికంలో ఉన్న వారికి సాయం చేస్తుంటారు. ఎక్కడైన రోడ్డుప్రమాదంలో గాయపడి, సరైన సమయంలో సహయం చేసే వారు ఎవరులేక.. ఉన్నవారిని మన హనీఫ్ వారికి ఆసుపత్రుల వద్ద దిగబేడుతుంటాడు. అలాగే ఆసుపత్రుల వద్ద ఆటోలు దొరక్క ఇబ్బందిపడుతున్నా వారినీ దగ్గరుండి ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్లి ఇంటి వద్దకు చేరుస్తారు.

ఇలా ఈ వృద్ధుడు రోజుకు కనీసం పదిమందికైనా సాయం చేస్తుంటారు. అయితే ఇలా చేయడానికి కారణం కూడా వెల్లడించారు ఆ వృద్థుడు. రెండు సంవత్సరాల క్రితం అతడు హజ్ యాత్రకు వెళ్లి వచ్చానని.. అప్పటి నుండి ఇతరులకు సాయం చేయాలని అనుకున్నానని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ నినాదానికి మంత్రముగ్దుడ్ని అయినట్లు చెప్పారు. ఆయన తన ఆటోపై ఫోన్ నంబర్, ఇతర వివరాలు రాసి సేవలందిస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడైన ప్రమాదాలకు గురైనప్పుడు తనకు ఫోన్ చేస్తారని చెప్పారు. ఇలా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ వృద్థుడు చేస్తున్న సేవలకు పలువురు ఫిదా అవుతున్నారు. ఈ వయసులో కూడా తన శాయశక్తులా ప్రజల అవసరాలు తీర్చుతూ శభాష్ అని పించుకుంటున్నాడు. పెద్దాయన సేవాలపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 



 


Tags:    

Similar News