2053 వరల్డ్ కప్ విన్నింగ్ టీం ఇదిగో చూడండి!

Update: 2019-07-17 12:51 GMT

ఏమిటీ 2023 అనబోయి.. 2053 అన్నమానుకుంటున్నారా? కాదు.. మీరిక్కడ చూస్తున్న ఫోటోలోని క్రికెటర్లను గుర్తుపట్టారా? అవును.. మన క్రికెటర్లే! అప్పటికి ఇలా కనిపిస్తారన్నమాట. ఇప్పుడు ఈ ఫోటో నేట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఇదేమిటో తెలుసుకోవాలనుందా.. ఆ వివరాలివిగో..

ఇటీవల ఫేస్ బుక్ లో కొత్తగా వచ్చిన ఫేస్ యాప్ విపరీతంగా పాపులర్ అయింది. అందులో ఇప్పటి మన ఫోటో పెట్టి.. ఓ 30 సంవత్సరాల తరువాత ఎలా ఉంటామో చూపించమంటే అది చూపిస్తూ ఫోటో ఇస్తుంది. దానిని ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ తెగ వాడేస్తున్నారు. దానిలో తమ ఫోటోలు పెట్టి ముసలి వారిగా ఎలావుంటారో చూసుకుని మురిసిపోతున్నారు. అంతే కాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ తమ ముసలి రూపును ముందే చూపించి మజా చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఓ ఔత్సాహిక నెటిజన్ టీమిండియా క్రికెటర్లు 2053లో ఎలా ఉంటారో అని చూపిస్తూ.. 2053 వరల్డ్ కప్ విన్నర్స్ అని క్యాప్షన్ పెట్టింది. సరదా పుట్టిస్తున్న ఈ ఫోటోతో పాటు ఆమె పోస్ట్ తెగ వైరల్ అవుతోందిప్పుడు. 



Tags:    

Similar News