నేటి నుంచి యూఏఈలో మోదీ పర్యటన

నేటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. నేడు యూఏఈలోని అబుదాబిలో, రేపు బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది.

Update: 2019-08-23 03:31 GMT

నేటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. నేడు యూఏఈలోని అబుదాబిలో, రేపు బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది. యూఏఈ, బహ్రెయిన్‌లో మన దేశ పారిశ్రామికవేత్తల కోసం జారీ చేయనున్న రూపే కార్డును నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. అలాగే యూఏఈ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీకి 'ఫాదర్‌ ఆఫ్‌ ఫౌండర్‌ యూఏఈ' పురస్కారాన్ని అందజేయనుంది. అయితే బహ్రెయిన్‌లో పర్యటించనున్న మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రులు, ఇతర శాఖల మంత్రులు మాత్రమే బహ్రెయిన్‌లో పర్యటించారు. నేటి నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లలో మోదీ పర్యటన ఉంటుంది.

Tags:    

Similar News