కేంద్ర బడ్జెట్ ముఖ్యంశాలు..

Update: 2019-02-01 06:34 GMT

60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు వచ్చే విధంగా ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్‌ పథకం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌. అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది.

*చిన్నసన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నాం.

*ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల సాయం అందజేస్తాం.

*ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు

*రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపు

*నేరుగా ఖాతాలోకే కేంద్రం నగదు సాయం. మూడు విడతల్లో నగదు అందజేత. తొలి విడతగా తక్షణమే రూ.2వేల సాయం.

*రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లింపు

12 కోట్ల రైతులకు లబ్ధి

*కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల కింద రుణాలు

*బ్యాంకింగ్‌ రంగంలో మార్పులు తీసుకొచ్చాం

*ఎగవేత దారుల నుంచి రూ. 3లక్షల కోట్లు రికవరీ చేశాం

*స్వచ్చ భారత్‌ పథకం ద్వారా బహిరంగ మలవిసర్జన తగ్గింది

*ప్రజల్లో పారిశుధ్యం పట్ల అవగాహన కల్పించడంలో కీలకపాత్ర పోషించింది

*రైతు పెట్టుబడి సాయం 2018 డిసెంబర్‌ నుంచే అమలు

*రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు

*ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్‌

*ఆయుష్మాన్‌ భారత్‌ కు 60వేల కోట్లు

*ప్రపంచంలో అతిపెద్ద పథకం

*50 కోట్ల మందికి అవకాశం

*హరియాణాలో 22వ ఏటీఎమ్‌ ఏర్పాటు చేస్తున్నాం

*పీఎం సమ్మాన్ నిధి పేరుతో

*చిన్నతరహా రైతులకు నగదు పథకం

*రెండు హెక్టార్లు ఉన్న రైతులకు ఏడాదికి 6వేలు ఎకరానికి

*నగదు బదిలీ ద్వారా మూడు విడతల్లో ఇస్తాం

*ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది. కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు. గ్యాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నాం. పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు.

*గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం. గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు

Similar News