ఎస్బీఐ 8,134 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నూతన సంవత్సరంలో నిరుద్యోగు యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను తెలిపింది.
నూతన సంవత్సరంలో నిరుద్యోగు యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను తెలిపింది. స్టేట్ బ్యాంకులో 8,134 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగం, జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉన్నాయి. 134 బ్యాక్లాగ్ పోస్టులన్నాయి. అంతే కాకుండా స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 3, 2020 నుంచి 26 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎస్ బీఐ అధికారిక వెబ్సైట్లో ఉంచింది.
మొత్తం ఖాళీలు: 8,134
♦ రెగ్యులర్ పోస్టులు -7,870
♦ (ఏపీ-150, తెలంగాణ-375)
♦ బ్యాక్లాగ్ పోస్టులు - 134
♦ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ - 130
♦ విద్యార్హత : 01.01.2020 నాటికి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
♦ 01.01.2020 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
♦ 02.01.1992 - 01.01.2000 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు రుసుము..
♦ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750
♦ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు
♦ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
♦ ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా
ముఖ్యమైన తేదీలు..
♦ నోటిఫికేషన్ విడుదల - 02.01.2020
♦ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం - 03.01.2020
♦ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది - 26.01.2020
♦ ప్రిలిమినరీ పరీక్ష - 2020 ఫిబ్రవరి/ మార్చి.
♦ మెయిన్ పరీక్ష తేది - 19.04.2020.