రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని పెరోల్‌పై విడుదల

Update: 2019-07-25 07:10 GMT

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని శ్రీహరణ్‌కు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితురాలు నళిని పెరోల్ పై విడుదల అయింది. తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. తన కూతురి పెళ్లికి హాజరయ్యేందుకు పెరోల్ పై విడుదల చేయాలని నళిని పిటిషన్ వేయగా, మద్రాస్ హైకోర్టు 30 రోజుల పాటు మంజూరు చేసింది. దీంతో ఆమెను నేడు వెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదల చేశారు. పెరోల్‌పై విడుదలైన తర్వాత ఆమె ఏ రాజకీయ నాయకులను కలుసుకోకూడదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టరాదని హైకోర్టు షరతులు విధించింది.

Tags:    

Similar News