పేదవాడికి మరణమూ శాపమే! భార్య మృతదేహాన్ని 45 కిలోమీటర్ల మేర రిక్షాలో లాక్కెళ్లిన భర్త

అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి.. చికిత్స పొందుతూ మృతి చెందిన భార్య అంబులెన్స్ ఏర్పాటు చేయమన్నా కనికరించని ఆసుపత్రి సిబ్బంది రిక్షాలో వేసుకుని లాక్కుంటూ ఇంటికి చేర్చిన భర్త

Update: 2019-09-21 04:46 GMT

డబ్బు.. ఇది లేకపోతే మరణమూ శాపంగానే మారుతుంది. పేదవాడి కష్టాలు చెప్పుకుంటే ఎన్నో. అయితే, ఒక్కోసారి కొన్ని విషయాలు వింటే మనసు ద్రవించి పోతుంది. 

అతనో రిక్షా కార్మికుడు. కల్లూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్  కు 45 కిలోమీటర్ల దూరంలో శంకర్‌గఢ్‌లోని సరూర్‌గంజ్‌ వద్ద జీవిస్తుంటాడు.  అతని భార్యకు తీవ్ర అస్వస్థత కలిగింది. దాంతో ఎదో తిప్పలు పడి ఆమెను వెంటనే ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడామె చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. దీంతో తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయమని ఆసుపత్రి సిబ్బందిని కల్లూ బతిమాలాడు. డబ్బు లేకపోతే అది జరగని పని అని వారు కల్లూ ను విసుక్కున్నారు. ఒక్కరు కూడా అతని మాట విన్న పాపాన పోలేదు. సరికదా వెంటనే మృత దేహాన్ని అక్కడినుంచి తీసుకువేల్లిపోవాలని గొడవ చేశారు. దీంతో చేసేదేం లేక ఏకంగా 45 కిలోమీటర్లు రిక్షాలో ఆమె మ్రుతదేశాన్ని స్వస్థలానికి తీసుకుని వెళ్ళాడు. 

Tags:    

Similar News