పసిబిడ్డ మృతికి కారణమైన పాక్ కాల్పులు

Update: 2019-07-30 03:21 GMT

పాకిస్థాన్ చెప్పేదొకటి ఉంటుంది. చేసేది మరోలా ఉంటుంది. భారత్ తో సఖ్యత కోరుతున్నామని అంతర్జాతీయ సమాజం వద్ద చెబుతుంటుంది. కానీ, కాశ్మీర్ సరిహద్దుల్లో మాత్రం కాల్పులకు తెగబడుతుంది. ఇలా కాల్పులతో మన జవాన్లను కవ్వించడం పాక్ నిత్యకృత్యం. దీనివలన ఒక్కోసారి అమాయకులు పాక్ దురాగతాలకు బలి అవుతుంటారు.

సోమవారం అలంటి సంఘటనే చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ దగ్గరలోని షాహ్‌పుర్‌ గ్రామంపై పాక్ సైన్యం ఆదివారం అర్థరాత్రి కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో నెలల శిశువుతో పాటు, శిశువు తల్లి ఫాతిమా జాన్, మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తీ గాయపడ్డారు. అయితే, సోమవారం చికిత్స పొందుతున్న వారిలో పసికందు మరణించాడు. మిగిలిన ఇద్దరూ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News